వ్యాసుడు

వ్యాసుడు ... అంటే విశాలమైన దృష్టి కలవాడని అర్థం. వ్యాస మహర్షి వేదాలను విభజించాడు ... అష్టాదశ పురాణాలను రచించాడు. ఈ నేపథ్యంలో వ్యాసుడు ఒకరేననీ అందరూ భావిస్తుంటారు. అయితే వ్యాస అనేది పేరు కాదనీ ... అది వారు అలంకరించిన పీఠం పేరని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. పురాణాల ప్రకారం ఒక్కో కల్పంలో ఒక్కో వ్యాసుడు అవతరించినట్టు తెలుస్తోంది. ఇంత వరకూ 28 మంది వ్యాసులు అవతరించినట్టు విష్ణుపురాణం చెబుతోంది.

ఆ ప్రకారం స్వయంభువు ... ప్రజాపతి ... శుక్ర ... బృహస్పతి ... సవితృ ... మృత్యు ... ఇంద్ర ... వశిష్ఠ ... సారస్వత ... త్రిధామ ... విశిశు ... భవద్వాజ ... కౌశవ ... వర్ణి ... త్రయ్యారుణి ... ధనంజయం ... జయ ... గౌతమ ... హర్యాత్మ ... శుష్మాయణ ... తృణ బిందు ... వాల్మీకి ... శక్తి ... పరాశర ... జాతకర్ణి ... కృష్ణ ద్వైపాయనులు వ్యాస పదవిని అలంకరించారు.

వ్యాసులందరిలోను కృష్ణ ద్వైపాయనుడిగా చెప్పబడే వ్యాసుడు ఆధ్యాత్మిక ప్రపంచాన విశిష్టమైన పాత్రను పోషించాడు. వ్యాసాయ విష్ణు రూపాయ అని చెప్పబడింది కాబట్టి, ఆయనను దైవ స్వరూపంగా భావించి హృదయ పీఠంపై ప్రతిష్ఠించుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికీ వుంది.


More Bhakti News