కాశీలో అన్నపూర్ణమ్మ తల్లి అలా కొలువైందట

కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు విశ్వనాథుడితో పాటు అన్నపూర్ణమ్మ తల్లి దర్శనం కూడా చేసుకుంటూ వుంటారు. అన్నపూర్ణమ్మ ఈ క్షేత్రంలో కొలువై ఉండటం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథనం అక్కడ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం పరమశివుడు కైలాసంలో ధ్యానంలో ఉండగా .. వెనక నుంచి పార్వతీదేవి వచ్చి సరదాగా ఆయన కళ్లు మూసింది. ఒక్కసారిగా లోకాలన్నీ చీకట్లు అలుముకోవడంతో .. తాను చేసింది ఎంత పెద్ద పొరపాటు అనే విషయం పార్వతీదేవికి అర్థమైంది.

తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం అమ్మవారు కాశీ నగరానికి చేరుకుంటుంది. ఆ సమయంలో కాశీ నగరంలో కరవు కాటకాలతో ప్రజలు బాధలుపడుతూ వుంటారు. అక్కడ అన్నపూర్ణమ్మగా పిలవబడుతూ .. ఆకలితో వున్నవారికి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. అన్నపూర్ణమ్మ రాకతో కాశీ నగరంలో ఆకలి బాధలు లేకుండా పోతాయి. ఈ విషయం తెలుసుకున్న కాశీ రాజు ఆశ్చర్యంతో అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకుంటాడు. ఆమె సాక్షాత్తు పార్వతీదేవి అనే విషయాన్ని గ్రహించి .. భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. కాశీ నగరంలోనే ఎప్పటికీ కొలువై ఉండమని ప్రార్ధిస్తాడు. అందుకు అంగీకరించిన ఆ తల్లి అక్కడే కొలువై పూజలు అందుకుంటోంది.   


More Bhakti News