దేవతలు .. పక్షి వాహనాలు

దేవాలయాలు పవిత్రతకు .. ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి .. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. ఏ దేవాలయానికి వెళ్లినా ఆ దైవానికి ఎదురుగా వాహనం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. వైష్ణవ ఆలయాల్లో గరుత్మంతుడు .. శివాలయాల్లో నందీశ్వరుడు .. అమ్మవారి ఆలయాల్లో సింహం .. ఇలా గర్భాలయానికి ఎదురుగా దర్శనమిస్తూ ఉంటాయి.

ఇక పక్షులను వాహనాలుగా కలిగిన దేవతలు కొంతమంది వున్నారు. శ్రీమహావిష్ణువు వాహనంగా 'గరుడ పక్షి' .. లక్ష్మీదేవి వాహనంగా 'గుడ్లగూబ' కనిపిస్తాయి. బ్రహ్మ .. సరస్వతిదేవి వాహనంగా 'హంస' .. కుమారస్వామి వాహనంగా 'నెమలి' .. శని దేవుడి వాహనంగా 'కాకి' దర్శనమిస్తాయి. ఇక పంచబాణాలతో మనసును చెదరగొట్టే మన్మథుడు 'చిలుక'ను వాహనంగా చేసుకుని కనిపిస్తాడు. ఇలా ఆయా దేవతలు పక్షులను వాహనాలుగా చేసుకుని కనిపిస్తారు .. అంకితభావంతో సేవించినవారిని అనుగ్రహిస్తారు.       


More Bhakti News