బరువెక్కిన ఖాళీ పల్లకి

అనునిత్యం .. అనుక్షణం భగవంతుడిని స్మరిస్తూ .. కీర్తిస్తూ తరించిన మహాభక్తులు ఎంతోమంది వున్నారు. అలాంటి మహాభక్తుల జాబితాలో 'దత్తుడు' ఒకరుగా కనిపిస్తాడు. తంజావురు నివాసియైన దత్తుడు .. శ్రీరంగనాథుడి భక్తుడు. ఆయన భక్తిని గురించి ..  పాండిత్య పటిమను గురించి తెలుసుకున్న రాజుగారు, ఆయనను తన ఆస్థానానికి తీసుకురమ్మని పల్లకీని పంపిస్తాడు.

దత్తుడు వయసు రీత్యా చిన్నవాడు కావడంతో, 'ఇతనికా పల్లకీ' అని సేనాపతి మనసులో అనుకుంటాడు. అది గ్రహించిన దత్తుడు తాను నడిచే వస్తానని చెప్పి వాళ్లతో పాటు బయలుదేరుతాడు. అయితే ఖాళీ పల్లకీని మోసుకొస్తున్న వాళ్లు, అది అంతకంతకూ బరువు పెరిగిపోతోందని సేనాపతితో చెబుతారు. ఇక ఆ పల్లకిని మోయడం తమ వలన కావడం లేదని అంటారు. కారణాన్ని గ్రహించిన సేనాపతి, తనని మన్నించవలసిందిగా దత్తుడిని కోరతాడు. దత్తుడు ఒక తులసి దళాన్ని ఆ పల్లకీలో ఉంచడంతో అది ఒక్కసారిగా తేలిక అవుతుంది. దాంతో వాళ్లంతా దత్తుడి పాదాలకి నమస్కరించి పల్లకీని తేలికగా మోస్తూ తమ రాజ్యానికి చేరుకుంటారు.      


More Bhakti News