తిరుమలలో పాండవతీర్థం ప్రత్యేకత

పరమపవిత్రమైన .. మహిమాన్వితమైన పుణ్య క్షేత్రాలలో తిరుమల ఒకటి. తిరుమల దర్శనం వలన ఆధ్యాత్మికపరమైన అనుభూతిని పొందని భక్తులంటూ వుండరు. ప్రతి ఏడాది ఈ క్షేత్రాన్ని తప్పకుండగా దర్శించే భక్తులు ఎంతోమంది వుంటారు. అలాంటి ఈ క్షేత్రం ఎన్నో పుణ్యతీర్థాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి తీర్థాలలో ఒక్కో తీర్థం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. అలాంటి తీర్థాలలో 'పాండవతీర్థం' ఒకటి.

అరణ్యవాస సమయంలో పాండవులు నానా ఇబ్బందులు పడుతుండగా ఇక్కడి తీర్థంలో స్నానమాచరించడం వలన మంచి ఫలితం ఉంటుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడట. దాంతో పాండవులు కొంతకాలం పాటు ఇక్కడే ఉంటూ అనునిత్యం ఈ తీర్థంలో స్నానం చేశారట. ఈ తీర్థంలో స్నానమాచరించిన ఫలితంగానే కౌరవులపై పాండవులు విజయాన్ని సాధించారట. పాండవులు స్నానమాచరించి మంచి ఫలితాన్ని పొందిన కారణంగానే ఈ తీర్థానికి 'పాండవ తీర్థం' అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.   


More Bhakti News