భక్తుడి కోసం కొలువైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు

సప్త మోక్ష పురాలలో 'ఉజ్జయిని' ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడి సాందీపని మహర్షి ఆశ్రమంలోనే శ్రీకృష్ణ బలరాములు విద్యాభ్యాసం చేసినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శిప్రా నదీ తీరంలోని ఈ క్షేత్రంలో సదాశివుడు మహాకాళేశ్వరుడుగా పిలవబడుతూ.. జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటున్నాడు. భక్తులు శిప్రా నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటూ వుంటారు.

ఒక్కో జ్యోతిర్లింగాన్ని దర్శించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుంది. ఉజ్జయినిలోని మాహాకాళేశ్వరుడిని దర్శించుకోవడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని అంటారు. ఇక్కడ మహాకాళేశ్వరుడు ఆవిర్భవించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడట. దూషణుడు అనే రాక్షసుడు .. వేదప్రియుడి కుమారుడైన దేవప్రియుడిని చంపడానికి సిద్ధపడతాడు. దేవప్రియుడు పరమేశ్వరుడిని తలచుకోవడంతో ఆ స్వామి ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించాడట. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడి కోరిక మేరకు ఆయన ఇంట్లోనే స్వామి కొలువయ్యాడని చెబుతారు.       


More Bhakti News