రుక్మిణీదేవి ఈ అమ్మవారిని అర్చించేదట

'రుక్మిణీ దేవి కల్యాణం' వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది .. ఆ కథ వింటూ ఉంటే అందుకు సంబంధించిన దృశ్యమాలిక కనులముందు కదలాడుతూ ఉంటుంది. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిపై మనసుపడుతుంది. ఆమె సౌందర్యం .. గుణ విశేషాలను గురించి తెలుసుకున్న కృష్ణుడు, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే రుక్మిణీదేవి సోదరుడు రుక్మి .. ఆమెకు ఇష్టం లేకపోయినా శిశుపాలునితో వివాహం జరిపించడానికి సిద్ధపడతాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే బయలుదేరుతాడు. పెళ్లి కూతురుగా ముస్తాబైన రుక్మిణీదేవి .. తమకుల దైవమైన 'శ్రీ మూలాంకురేశ్వరి' అమ్మవారిని దర్శించుకోవడానికి వెళుతుంది. ఆమె పూజ పూర్తి చేయగానే శ్రీ కృష్ణుడు వచ్చి తన రథంపై ఆమెను తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడు. అలా రుక్మిణీదేవి కుల దైవంగా చెప్పబడుతున్న అమ్మవారి ఆలయం మనకి గుంటూరు జిల్లా 'ఫిరంగిపురం' మండలం పరిథిలో గల అమీనాబాద్ లో కనిపిస్తుంది. ఆ తల్లిని రుక్మిణీదేవి కొలిచేది అనే విషయం తెలియగానే మనసు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది. చిన్నకొండపై కనిపించే ఈ ఆలయం ఆనాటి ఘట్టాన్ని కనులముందుచుతూ ఉంటుంది.        


More Bhakti News