ఫాల్గుణ మాసం శ్రీమహా విష్ణువుకి ప్రీతికరం

ఫాల్గుణ మాసం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనదిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాసంలోని మొదటి పన్నెండు రోజులు శ్రీమహా విష్ణువును పూజించడం వలన .. ఆ స్వామిని అంకితభావంతో ఆరాధించడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో ఉపవాస జాగరణ నియమాలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు పటాపంచలై పుణ్యరాశి పెరుగుతుంది.

 ఈ మాసంలోని పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన, దారిద్ర్య బాధలు తొలగిపోయి .. సిరి సంపదలు చేకూరతాయి. ఈ మాసంలో చేసే పూజల వలన మాత్రమే కాదు, దానాల వలన కూడా అనేక రెట్ల ఫలితం దక్కుతుందనేది పండితుల మాట. అందువలన ఫాల్గుణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీమహా విష్ణువును సేవించాలి .. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలలో తరించాలి.   


More Bhakti News