కాశీలో సాంబాదిత్యుని ఆలయం ప్రత్యేకత

జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం .. కాశీ. విశ్వనాథుడు కొలువైన ఈ క్షేత్రం అనేక విశేషాలకు నెలవుగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి సూర్య కుండం సమీపంలో సాంబాదిత్యుని ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి సూర్య భగవానుడు .. 'సాంబాదిత్యుడు' అనే పేరుతో పూజించబడుతుండటం వెనుక, పురాణ సంబంధమైన ఒక కథ వినిపిస్తూ వుంటుంది. శ్రీకృష్ణుడి అష్ట భార్యలలో 'జాంబవతి' ఒకరు. ఆమెకి జన్మించిన పుత్రుడే సాంబుడు.

ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుడి దర్శనార్థం వచ్చినప్పుడు, ఆయన పట్ల సాంబుడు అవమానకరంగా ప్రవర్తిస్తాడు. అది గమనించిన శ్రీకృష్ణ్డుడు .. కుష్ఠు వ్యాధితో ఫలితాన్ని అనుభవించమని శపిస్తాడు. ఆ తరువాత శాంతించిన శ్రీకృష్ణుడు .. కాశీ క్షేత్రానికి చేరుకొని సూర్యుడిని ఆరాధించమని .. శాప విమోచనం అవుతుందని చెబుతాడు. దాంతో కాశీ క్షేత్రానికి చేరుకున్న సాంబుడు .. అక్కడ ఓ కుండాన్ని ఏర్పాటు చేసుకుని .. సూర్యదేవుణ్ణి ప్రతిష్ఠించి ఆరాధిస్తాడు. సూర్యభగవానుడి అనుగ్రహంతో కుష్ఠువ్యాధి నుంచి విముక్తుడు అవుతాడు. అందువల్లనే ఇక్కడి స్వామిని 'సాంబాదిత్యుడు' అని అంటారు.       


More Bhakti News