భక్తుడి కోసమే వెలసిన జంబుకేశ్వరుడు

పరమ శివుడు ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన .. మహిమాన్వితమైన క్షేత్రాలలో 'జంబుకేశ్వరం' ఒకటి. పంచభూత క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే ఈ క్షేత్రం, తమిళనాడు - తిరుచునాపల్లికి సమీపంలో వెలుగొందుతోంది. ఈ క్షేత్రంలో స్వామివారు 'జల లింగం'గా పూజలు అందుకుంటూ ఉంటాడు. స్వామివారు ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణంగా ఒక ఆసక్తికరమైన కథనం ఈ క్షేత్రంలో వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం 'శంభుడు' అనే రుషి .. శివుడి కోసం కఠోర తపస్సు చేశాడట. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై, ఏం కావాలో కోరుకోమని అడిగాడు. మిమ్మల్ని ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం ఎప్పటికీ కలిగేలా వరం ఇవ్వమని 'శంభుడు' అడిగాడు. 'నీ కోరిక మేరకు ఇక్కడ నేను లింగ రూపంలో ఆవిర్భవిస్తాను .. నీవు జంబూ వృక్షం రూపాన్ని పొంది నాకు సమీపంలోనే ఉంటూ నన్ను దర్శించుకుంటూ ఉంటావు' అని స్వామి వరాన్ని ప్రసాదించాడట. అలా శివుడు జల లింగంగా ఆవిర్భవించగా .. 'శంభుడు' జంబూ వృక్షంగా మారిపోయాడట. ఆలయ ప్రాంగణంలోని జంబూ వృక్షాన్ని 'శంభుడు' గానే నేటికీ భక్తులు భావిస్తుంటారు. 


More Bhakti News