మోక్షదా ఏకాదశి వ్రత ఫలితం

మార్గశిర శుద్ధ ఏకాదశికే 'మోక్షదా ఏకాదశి' అని పేరు. దీనినే 'సౌఖ్యదా ఏకాదశి'అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహా విష్ణువును పూజించాలి. స్వామివారి నామ స్మరణ చేస్తూ .. ఆయన లీలా విశేషాలను అనేక విధాలుగా కీర్తిస్తూ ఆ రాత్రంతా జాగరణ చేయవలసి ఉంటుంది. మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుమూర్తిని పూజించి .. ఆ స్వామికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించాలి.

పూర్వం వైఖాసనుడనే రాజు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా ఆ రాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆయన తండ్రికి నరక బాధల నుంచి విముక్తి లభించి .. పుణ్యగతులు కలిగాయట.  ఈ ఏకాదశి వ్రత ఫలితం కారణంగా జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది. అందువల్లనే ఈ ఏకాదశికి .. మోక్షదా ఏకాదశి అనే పేరు వచ్చింది.      


More Bhakti News