కార్తీకంలో నియమాలు .. నిషిద్ధాలు

కార్తీక మాసం .. శివకేశవులకు ప్రీతికరమైన పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా .. గోదావరి .. కృష్ణ వంటి నదులను తలచుకుంటూ స్నానమాచరించాలి. ఈ రోజుల్లో శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకం చేయించాలి. అనునిత్యం 'కార్తీక పురాణం' పారాయణ చేయాలి. అలాగే ఈ మాసంలో తులసి మాలను ధరించడం .. వైష్ణవ ఆలయాలను దర్శించుకోవడం చేయాలి. శివుడికి లక్ష బిల్వార్చన .. విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ .. అమ్మవారికి లక్ష పుష్పార్చన చేయించడం అనంతమైన ఫలితాలను ఇస్తుంది.

ఈ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి 'నక్షత్ర దర్శనం' అయిన తరువాత భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి. 'పనస' ఆకుల్లో భోజనం చేయడం శ్రేష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఉసిరిక చెట్టుకు 9 ప్రదక్షిణలు చేసి .. సహపంక్తి భోజనాలు (వనభోజనాలు) చేయడం వలన .. ఆలయాలలో దీపాలు వెలిగించడం వలన ..  దీపదానాలు చేయడం వలన .. దానధర్మాలు చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ మాసంలో ఉల్లి .. నీరుల్లి .. చద్ది అన్నం .. మాంసం .. మద్యం .. వంకాయ వంటివి తీసుకోవడం నిషిధ్ధంగా చెప్పబడ్డాయి. తలకి నూనె రాసుకోవడం .. వేడి నీటితో స్నానం కూడా నిషిద్ధాలుగా పేర్కొనబడ్డాయి.     


More Bhakti News