సౌభాగ్యాన్ని ప్రసాదించే కరక చతుర్థీ వ్రతం

కార్తీక మాసం .. సమస్త పాపాలను తొలగించి .. సకల దోషాలను నివారించే మాసం. ఈ మాసంలో ప్రతి రోజు విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ఈ మాసం అనేక నోములు .. వ్రతాల సమాహారంగా కనిపిస్తుంది. అలాంటి ఈ మాసంలో చేసే వ్రతాలలో ఒకటిగా 'కరక చతుర్థీ వ్రతం' కనిపిస్తుంది. 'కార్తీక బహుళ చవితి' రోజున కరక చతుర్థీ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించవలసి ఉంటుంది.

 ఈ రోజున పూజా మందిరాన్ని అలంకరించి .. వినాయకుడిని పంచామృతాలతో అభిషేకించాలి. ఆ తరువాత ఆ స్వామిని షోడశ ఉపచారాలతో పూజించి, వివిధ రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ వ్రతానికి ఉపవాస నియమం వుంది .. చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి. ఆ తరువాత చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. నియమ నిష్టలను పాటిస్తూ 12 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. కొన్ని ప్రాంతాలలో శివపార్వతులు .. కుమారస్వామి .. వినాయకులను కలిపి ఈ వ్రతాన్ని ఆచరించడమనేది వుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సుఖసంతోషాలు .. సౌభాగ్య సిద్ధి కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి           


More Bhakti News