కార్తీక పౌర్ణమి రోజున భక్తేశ్వర వ్రతం

కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనది .. ఈ రోజున చేసిన పూజలు .. నోములు .. వ్రతాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఇక ఈ రోజున ఆచరించవలసిన వ్రతంగా 'భక్తేశ్వర వ్రతం' చెప్పబడుతోంది. పూర్వం చంద్రపాండ్య మహారాజు దంపతులకు అల్పాయుష్కుడైన కుమారుడు కలుగుతాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆ రాజకుమారుడికి 'అలకాపురి' రాజకుమార్తెతో వివాహం జరుగుతుంది. వివాహమైన తొలినాళ్లలోనే .. తన భర్త అల్పాయుష్కుడు అనే విషయం ఆమెకు తెలుస్తుంది.

 పరమశివుడికి భక్తురాలైన ఆమె, తన భర్తకు సంపూర్ణ ఆయుష్షును ప్రసాదించమని ఆ దేవదేవుడిని వేడుకుంటుంది. తనకి సౌభాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా సదాశివుడిని ప్రార్ధిస్తూ 'కార్తీక పౌర్ణమి' రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో 'భక్తేశ్వర వ్రతం' ఆచరిస్తుంది. పగలంతా ఉపవాస దీక్షను చేపట్టి .. ప్రదోష సమయంలో శివుడిని పూజించి ఆ స్వామికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తుంది. రాజకుమార్తె ఆచరించిన ఈ వ్రతం వలన ప్రీతి చెందిన శివుడు .. ఆమె భర్తకు సంపూర్ణ ఆయుష్షును ప్రసాదించినట్టు పురాణ కథనం.        


More Bhakti News