దీపావళి రోజున దీపదానం .. ఫలితం

'దీపావళి' అంటే దీపాల వరుస అని అర్థం. 'దీపావళి' పండుగ రోజున ప్రతి ఇల్లు దీపాలతో కాంతులు వెదజల్లుతూ కనిపిస్తుంది. దీపం లక్ష్మీ స్వరూపంగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే నిత్య దీపారాధన జరిగే ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. ఇక దీపావళి రోజున దీపాలను వెలిగించడం వలన లక్ష్మీదేవి ప్రీతి చెందుతుంది. సంపదలతో పాటు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

 ధన త్రయోదశి రోజున .. నరక చతుర్దశి రోజున .. దీపావళి రోజున .. ఆ మరునాడు అంటే 'కార్తీక మాసం' తొలి రోజున దీపదానాలు చేయడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నవాళ్లు .. ఆర్థికపరమైన సమస్యల కారణంగా అనుకున్నది సాధించలేక అసంతృప్తికి లోనైనవాళ్లు .. ఇలా దీపావళి రోజున దీపాలు వెలిగించడం .. దీపదానాలు చేయడం మంచిది. అందువలన ఆశించిన ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.           


More Bhakti News