నవగ్రహ చాలీసా పఠన ఫలితం

ఆకాశంలో తిరుగాడే నవగ్రహాలు భూమిపై నివసించే మానవాళి మనుగడపై ప్రభావం చూపుతుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయా గ్రహాల అనుగ్రహం లేకపోతే కొన్ని సమస్యలు .. ఇబ్బందులు ఎదురవుతూ వుంటాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రహ సంబంధమైన దోషాల కారణంగా ఆర్ధిక పరమైన .. ఆరోగ్య పరమైన సమస్యలు సతమతం చేస్తుంటాయి. వివాహంలో ఆలస్యం .. సంతాన లేమి వంటివి బాధిస్తూ ఉంటాయి. తలపెట్టిన కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి.
 
అందువలన చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తుంటారు .. అభిషేకాలు జరుపుతుంటారు .. గ్రహ శాంతులు చేయిస్తుంటారు. అలాంటి గ్రహ బాధల నుంచి విముక్తిని కలిగించే మార్గాలలో ఒకటిగా 'నవగ్రహ చాలీసా' చెప్పబడుతోంది. అనునిత్యం నవగ్రహాల చెంత తొమ్మిది దీపాలు వెలిగించి .. నవగ్రహాలకు నమస్కరిస్తూ 'నవగ్రహ చాలీసా'ను పఠించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి ఆశించిన ఫలితాలు కనిపిస్తాయని చెప్పబడుతోంది.         


More Bhakti News