శని త్రయోదశి రోజున శనిదేవుడికి తైలాభిషేకం

త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞను సూర్య భగవానుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. సూర్య భగవానుడి కిరణాల వేడిని భరించలేని ఆమె, తన నీడకి ప్రాణం పోసి తండ్రి దగ్గరికి వెళ్లిపోతుంది. సంజ్ఞచే ప్రాణం పోయబడిన నీడ .. ఛాయగా పిలవబడుతుంది. సూర్యభగవానుడికి .. ఛాయాదేవికి జన్మించినవాడే శనీశ్వరుడు. జీవితంలో ఎవరైనా ఒకసారి శనీశ్వరుడి బారిన పడక తప్పదని అంటూ వుంటారు.

భరత భూమిని పాలించిన చక్రవర్తులలో హరిశ్చంద్రుడు.. నలుడు .. పురుకుత్సుడు .. పురూరవుడు .. సగరుడు ..కార్తవీర్యార్జునుడు .. శని ప్రభావానికి లోనైనవారే. మహా పరాక్రమవంతులైన వారే .. శని ప్రభావం కారణంగా నానా కష్టాలు పడ్డారు .. ఎన్నో బాధలను అనుభవించారు. ఇక సామాన్యుల కష్టాలు ఏ స్థాయిలో వుంటాయో వేరే చెప్పేదేవుంది. శని ప్రభావానికి లోనైనప్పుడు ధర్మ మార్గాన్ని వీడకుండా చూసుకోవాలి. అలాగే మూగ జీవాల పట్ల సానుభూతిని ప్రదర్శిస్తూ ఉండాలి. శనిత్రయోదశి రోజున స్వామికి తైలాభిషేకం చేసి .. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా శనికి ప్రీతిని కలిగించే పనులు చేయడం వలన, ఆయన కృపా దృష్టి సోకి .. శని ప్రభావం నుంచి బయటపడటం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.       


More Bhakti News