శుభాలను ప్రసాదించే సూర్యారాధన!

ఉదయాన్నే తన వెలుగు కిరణాలతో ఈ జగత్తును స్పర్శిస్తూ, జీవకోటిని పలకరిస్తూ జీవాధార దాతగా సూర్యభగవానుడు కనిపిస్తూ ఉంటాడు. సూర్యనారాయణమూర్తిగా పిలవబడుతూ .. దేవతలచే .. మహర్షులచే అనునిత్యం పూజించబడుతుంటాడు. సకల చరా చర జగత్తుకు ఆత్మగా వెలుగొందే సూర్య భగవానుడు, అజ్ఞానపు చీకట్లను తొలగిస్తూ వుంటాడు. ఆ స్వామి అమృత కిరణాల కారణంగానే విశ్వంలోని ప్రాణకోటికి ఆహారం లభిస్తోంది. ఆయన కిరణాల స్పర్శతో ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ ఉంటాడు.

 అందువల్లనే సూర్యనారాయణమూర్తిని జనులంతా కూడా ప్రత్యక్ష దైవంగా భావిస్తూ వుంటారు. అనుదినం ఉదయాన్నే ఆ స్వామికి నమస్కరిస్తుంటారు. ఉదయం .. మధ్యాహ్నం .. సాయంత్రం వేళల్లో అర్ఘ్యం వదిలి ఆరాధిస్తూ వుంటారు. శ్రద్ధా భక్తులతో చేసిన నమస్కారం వలన .. సూర్యుడు ప్రీతి పాత్రుడవుతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ స్వామిని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయి. సూర్యారాధన వల్లనే శ్రీరాముడు యుద్ధంలో విజయాన్ని సాధించాడనీ, సూర్యుడి శిష్యుడైన కారణంగానే హనుమంతుడు అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.        


More Bhakti News