భస్మకూట పర్వతం వెనుక కథ!

అష్టాదశ శక్తి పీఠాలలో కామాఖ్యాదేవి శక్తి పీఠం ఒకటి. గౌహతి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. అమ్మవారి యోని భాగం ఈ ప్రదేశంలో పడిందని స్థల పురాణం చెబుతోంది. అత్యంత పవిత్రమైన ఈ పుణ్యస్థలికి సమీపంలోనే 'భస్మకూట పర్వతం' దర్శనమిస్తుంది. ఈ పర్వతానికి ఈ పేరు రావడం వెనుక పురాణ సంబంధమైన కథనం వుంది.

 లోక కళ్యాణం కోసం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఆవశ్యకమవుతుంది. దాంతో ఇంద్రాది దేవతలు మన్మథుడిని ఆశ్రయిస్తారు. సదాశివుడి సేవలో వున్న పార్వతీ దేవిపై ఆయన మనసు మళ్లేలా చేసి, వాళ్లిద్దరి కల్యాణం జరిగేలా చూడమని కోరతారు. దేవతల కోరిక మేరకు మన్మథుడు పంచ బాణాలు శివుడిపై ప్రయోగించి ఆయన మనసు చలించేలా చేస్తాడు. దాంతో ఆగ్రహించిన శివుడు .. మన్మథుడిని భస్మం చేస్తాడు. అలా మన్మథుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదేననీ .. అందువల్లనే ఈ పర్వతానికి భస్మకూట పర్వతమనే పేరు వచ్చిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.     


More Bhakti News