ఈ రోజున పాలను దానం చేయాలి

వైశాఖ శుద్ధ నవమి .. వైశాఖ శుద్ధ ఏకాదశి ఈ రెండు కూడా ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తాయి. వైశాఖ శుద్ధ నవమి రోజునే సీతాదేవి ఆవిర్భవించిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా కనిపిస్తే, సీతాదేవి ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి ఆనవాలుగా నిలుస్తుంది. నారీ లోకానికి సీతాదేవి ఆదర్శమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

అలాంటి సీతాదేవి ఈ రోజునే .. జనకుడు నాగలితో భూమిని దున్నుతూ వుండగా దొరికిందని స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున సీతారాములను దర్శించడం మంచిదని అంటున్నాయి. ఇక వైశాఖ శుద్ధ ఏకాదశిని 'మోహిని ఏకాదశి' అని అంటారు. ఈ రోజున అంత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహా విష్ణువును ఆరాధించవలసి ఉంటుంది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన .. 'పాల'ను దానం చేయడం వలన సమస్త పాపాలు నశిస్తాయట. విశేషమైన పుణ్య ఫలాల కారణంగా ఆయురారోగ్యాలు .. సిరిసంపదలు లభిస్తాయని చెప్పబడుతోంది.       


More Bhakti News