ఇలా చేస్తే చెడు కలలు రావట!

సాధారణంగా కలలు అనేవి ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. ప్రకృతి సంబంధమైన దృశ్యాలు .. జంతువులు .. ప్రమాదకరమైన సంఘటనలు .. వేడుకలు మొదలైనవి కలలో కనిపిస్తూ ఉంటాయి. మంచి కల వచ్చినప్పుడు మెలకువ తరువాత ఆనంద పడటం .. చెడు కల వచ్చినప్పుడు భయపడటం జరుగుతూ ఉంటుంది. చెడు కల నిజమవుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు కూడా.

 ఒక్కోసారి అదే పనిగా చెడు కలలు ప్రతిరోజూ వస్తుంటాయి. దాంతో మానసిక పరమైన ఆందోళన మరింత ఎక్కువవుతుంది. అలా చెడు కలలు తరచుగా వస్తున్నప్పుడు ఒక శ్లోకాన్ని పఠించమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
"రామ స్కంధం హనుమంతం
వైనతేయం వృకోదరం
శయనేయః పఠేన్నిత్యం
దుస్వప్నం తస్య నశ్యతిః"
అనే శ్లోకాన్ని .. నిద్రకి ఉపక్రమించే ముందు పఠించడం వలన, చెడు కలలు రాకుండా ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.     


More Bhakti News