చైత్రంలో రామాయణ విశేషాలు

మూర్తీభవించిన ధర్మ స్వరూపంగా శ్రీరామచంద్రుడు గురించి చెబుతారు. దుష్ట శిక్షణ .. శిష్ట రక్షణ కోసం సాక్షాత్తు శ్రీమహా విష్ణువే శ్రీరాముడిగా జన్మించాడు. అలా ఆ స్వామి శ్రీరాముడిగా చైత్ర శుద్ధ నవమి రోజున జన్మించాడు. అందువల్లనే ఆ రోజుని 'శ్రీరామ నవమి'గా భక్తులు జరుపుకుంటూ వుంటారు.

చైత్ర మాసంలో రాముడు జన్మించడమే కాదు .. ఆయనకి సంబంధించిన అనేక సంఘటనలు జరిగాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. చైత్ర మాసంలోనే శ్రీరామచంద్రుడు సీతమ్మవారితో కలిసి వనవాసానికి బయలుదేరాడు. సీతాదేవి ఒంటరిగా వున్న సమయంలో రావణుడు అపహరించాడు .. ఈ సంఘటన జరిగింది కూడా చైత్ర మాసంలోనే. రావణుడిని సంహరించిన అనంతరం, సీతారాములు అయోధ్య నగరానికి చేరుకుంది కూడా ఈ మాసంలోనే కావడం విశేషం.        


More Bhakti News