కారంజ నరసింహస్వామి ఆలయం

నరసింహస్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో 'అహోబిలం' ఒకటి. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో దర్శనమిస్తుంటాడు. అహోబిల నారసింహుడు .. జ్వాలా నారసింహుడు .. మాలోల నారసింహుడు .. కారంజ నారసింహుడు .. వరాహ నారసింహుడు .. యోగానంద నారసింహుడు .. భార్గవ నారసింహుడు .. పావన నారసింహుడు .. ఛత్రవట నారసింహుడు అనే తొమ్మిది రూపాలలో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు .. తన లీలా విశేషాలను ప్రదర్శిస్తూ ఉంటాడు.

 ఈ తొమ్మిది రూపాలలో ఒకటిగా కనిపించే 'కారంజ' నారసింహస్వామి ధ్యాన ముద్రలో కనిపిస్తుంటాడు. ఈ స్వామి ధనుస్సును ధరించి వుండటం ఇక్కడి విశేషం. పూర్వం ఇక్కడ హనుమంతుడు తపస్సు చేయగా, తానే శ్రీరాముడినని తెలియపరచడం కోసం స్వామి ఇలా ధనుస్సును ధరించి సాక్షాత్కరించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఈ స్వామిని దర్శించడం వలన సమస్త పాపాలు .. భయాలు .. దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.      


More Bhakti News