భగవంతుడు ఒక్కడే

నిత్య జీవితంలో దైవారాధనకి చాలామంది ప్రాధాన్యతను ఇస్తుంటారు. ప్రతి రోజు పూజ చేసుకునే .. వాళ్లు తమ దైనందిన కార్యక్రమాలను మొదలుపెడుతుంటారు. అయితే కొంతమంది ఒక దైవానికి సంబంధించిన అష్టోత్తరాలు .. స్తోత్రాలు చదివి .. మరో దేవతకి కోపం వస్తుందేమోనని ఆ దేవతకి సంబంధించిన స్తోత్రాలు చదవడం చేస్తుంటారు. ఇలా చాలా దేవతల స్తోత్రాలు చదువుతూ సమయం చాలక ఇబ్బంది పడుతుంటారు. ఏ దైవానికి సంబంధించిన ఆరాధన మిగిలిపోయినా బాధపడుతుంటారు.

ఇక మరికొంతమంది ఏదైనా ఆపదలో వున్నప్పుడు .. ఆ గండం నుంచి గట్టెక్కితే ఫలానా మొక్కు చెల్లిస్తామని ఒక దైవానికి మొక్కుకుంటారు. ఎందుకైనా మంచిదని మరికొంతమంది దేవతలకి కూడా మొక్కుకుంటూ వుంటారు. తీరా ఆ గండం గడిచాకా అంతమంది దేవతలకి మొక్కు చెల్లించే స్తోమత లేక ఆవేదన చెందుతుంటారు. ఇందుకు కారణం భగవంతుడు ఒక్కడే అనే విశ్వాసం లోపించడమే. రూపాలు వేరైనా .. నామాలు వేరైనా భగవంతుడు ఒక్కడే. ఆ దైవం పట్ల అత్యంత విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆరాధిస్తే ఆయన ప్రీతిచెందుతాడు. ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తూ అనుగ్రహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News