ఈ రోజున ఉపవాసం చేస్తే చాలు

ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండటం. భగవంతుడిని పూజిస్తూ .. ఆయనని సేవిస్తూ ఉండటం. భగవంతుడి నామాన్ని స్మరిస్తూ .. ఆయన భజనలు చేస్తూ .. ఆయనకి సంబంధించిన పురాణాలను పఠిస్తూ గడపడం. శరీరంతో పాటు మనసును భగవంతుడి సన్నిధిలో ఉంచుతూ .. అంకితభావంతో దైవాన్ని ఆరాధించడం. ఉపవాసం వలన భగవంతుడు ప్రీతి చెందుతాడు.

అలాంటి ఉపవాసం 'ముక్కోటి ఏకాదశి' రోజున చేయడం వలన, అనంతమైన పుణ్య ఫలాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువు దర్శనం చేసుకుంటారు కనుక, 'ముక్కోటి ఏకాదశి' అనే పేరు వచ్చింది. ఈ రోజున ఉపవాసం చేయడం వలన మోక్షం లభిస్తుంది. అందువలన దీనిని మోక్ష ఏకాదశిగాను చెబుతుంటారు. ఈ రోజున వైష్ణవ దేవాలయాల్లో 'ఉత్తర ద్వార దర్శనం' ఏర్పాటు చేస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారు జాము నుంచే భక్తులు 'క్యూ' కడుతుంటారు. సమస్త పాపాలను హరించి వేసి .. పుణ్యఫలాలను అందించే ఈ రోజున, స్వామివారి ఉత్తర ద్వార దర్శన అవకాశాన్ని వదులుకోకూడదు.


More Bhakti News