మధుసూదనుడు పేరుతో శ్రీహరిని సేవించాలి

శ్రీమహావిష్ణువు అనేక నామాలతో పూజించబడుతున్నాడు .. అలాంటి నామాలలో ఒకటైన 'మధుసూదనుడు' పేరుతో ఆయనని 'ధనుర్మాసం'లో పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు,వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంత వరకూ గల కాలం ధనుర్మాసంగా చెప్పబడుతోంది.

అత్యంత పవిత్రమైన ఈ మాసంలో తెల్లవారుజామునే స్నానం చేసి 'తిరుప్పావై'ని పఠించడం వలన, శ్రీహరిని .. మధుసూదనుడు పేరుతో పూజించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ మాసంలో వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తుల సందడితో కనిపిస్తుంటాయి. స్వామివారి ఆలయాలలో మొదటి 15 రోజులు 'చక్కర పొంగలి'ని .. ఆ తరువాత 15 రోజుల్లో 'దద్యోదనం'ను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి .. స్వామి వారి దర్శనం చేసుకుని .. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి .. అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి.


More Bhakti News