కార్తీక శుద్ధ చతుర్దశి ప్రత్యేకత

శ్రీమహా విష్ణువును పూజించడం వలన పరమశివుడు ప్రీతి చెందుతాడనీ, ఆయనని సేవించడం వలన శ్రీమహావిష్ణువు సంతృప్తి చెందుతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి శివకేశవులకి ఎంతో ఇష్టమైన మాసంగా కార్తీక మాసం కనిపిస్తుంది. ఈ మాసమంతా శివకేశవులను ఆరాధించడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

ముఖ్యంగా కార్తీక శుద్ధ చతుర్దశి రోజున శివకేశవులను పూజించడం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది. ఈ రోజు ఎంత విశిష్టమైనదంటే, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి కాశీ క్షేత్రానికి వెళ్లి, విశ్వనాథుడిని స్వయంగా పూజిస్తాడట. అంతటి విశేషాన్ని సంతరించుకున్న ఈ రోజున శివకేశవుల నామాలను భక్తి శ్రద్ధలతో స్మరించాలి. శివకేశవుల ఆలయాలను దర్శించాలి. ఆయా క్షేత్రాలకి వెళ్లినప్పుడు శక్తి కొద్దీ దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన భక్తులపట్ల శివకేశవులు ప్రీతి చెంది అనుగ్రహిస్తారు.


More Bhakti News