క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ

చాలామంది ఇళ్లలో తులసికోట కనిపిస్తుంటుంది. ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేసి తులసిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ఆధ్యాత్మిక పరంగానే కాదు .. ఆరోగ్యపరంగా కూడా తులసి చూపే ప్రభావం ఎక్కువ. అనుదినం తులసిని పూజించడం వలన, ఉత్తమమైన ఫలితాలను పొందడం జరుగుతుంటుంది. ముఖ్యంగా 'క్షీరాబ్ది ద్వాదశి' రోజున తులసి తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పూర్వం దేవతలు .. రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించింది ఈ రోజునే. శ్రీమహాలక్ష్మితో కలిసి శ్రీమహావిష్ణువు ఈ రోజునే తులసి కోటలోకి ప్రవేశిస్తాడని అంటారు. తులసికోటలో లక్ష్మీనారాయణులు కొలువై వుంటారు గనుక, ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. ఈ రోజున తులసిని పూజించినవారిని అకాల మృత్యువు దరిచేరదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News