కుంతీ మాధవుడి దర్శనం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటిగా 'పిఠాపురం' అలరారుతోంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రంగా .. కుక్కుటేశ్వరస్వామి క్షేత్రంగా .. పురూహుతికా దేవి శక్తిపీఠంగా ఇది విలసిల్లుతోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. అలాంటి ఈ క్షేత్రంలో 'కుంతీ మాధవస్వామి' కూడా పూజలు అందుకుంటున్నాడు.

దేవేంద్రుడు బ్రహ్మ హత్యా పాతకం నుంచి విముక్తిని పొందడం కోసం, అయిదు ప్రదేశాల్లో మాధవస్వామిని ప్రతిష్ఠించి పూజించాడు. అలా ఆయన కాశీలో 'బింధుమాధవస్వామి'ని .. ప్రయాగలో 'వేణుమాధవస్వామి'ని .. రామేశ్వరంలో 'సేతుమాధవస్వామి'ని .. అనంత పద్మనాభంలో 'సుందర మాధవస్వామి'ని .. పిఠాపురంలో 'కుంతీ మాధవస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఇక్కడి స్వామిని కుంతీదేవి కూడా పూజించినట్టు చెబుతుంటారు. పిఠాపురం క్షేత్రాన్ని దర్శించిన వాళ్లు తప్పకుండా 'కుంతీమాధవ స్వామిని' దర్శించుకోవాలనీ, అప్పుడే క్షేత్ర దర్శన ఫలితం సంపూర్ణంగా లభిస్తుందని అంటారు.


More Bhakti News