కోరికలు నెరవేర్చు కొండంత రాముడు

సీతారాముల ఆలయం లేని ఊరు గానీ .. వాళ్ల చిత్రపటం లేని పూజా మందిరం గాని ఎక్కడా కనిపించవు. అంతగా సీతారాములు ప్రజలకి చేరువయ్యారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ పుణ్య దంపతులు ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందువల్లనే లోకానికి ఆదర్శప్రాయమయ్యారు. ఎంతోమంది రాజులు సీతారాముల ఆలయాలను నిర్మించారు. మరెంతో మంది భక్తులు సీతారాములను దర్శించి తరించారు.

అలాంటి ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా 'సీతారామపురం' దర్శనమిస్తుంది. శ్రీకాకుళం జిల్లా రాజామ్ పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. సువిశాలమైన ప్రదేశంలో బొబ్బిలి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం, అలనాటి వైభవానికి అద్దం పడుతుంటుంది.

చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ వుంటారు. స్వామివారి దర్శన భాగ్యం కారణంగా, మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని అంటారు. ఇక ప్రతి యేటా ఇక్కడ జరిపే సీతారాముల కల్యాణోత్సవం చూసి తీరవలసిందే.


More Bhakti News