దానం విశేషమైన ఫలితాలను ఇస్తుంది

ప్రతి ఒక్కరూ కూడా తమ సంపాదనలో తమకి తోచినంత .. తమ శక్తి కొలది ఇతరులకి దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పూర్వజన్మలో దానం చేయడం వల్లనే ఇతరులకి దానం చేసే స్థితి కలుగుతుందని చెప్పబడుతోంది. దానాలు చేయడం వలన సంపద వృద్ధి చెందుతుంది. పాపాలు .. దోషాలు తొలగిపోతాయి. అందువలన నిస్సహాయులకు దానం చేయడం మరువకూడదు.

క్షేత్రాల్లో చేసే దానం మరింత ఫలితాన్ని ఇస్తుంది. అందునా నదీ తీరాల్లో చేసే దానం విశేషమైన పుణ్య ఫలితాలను అందిస్తుంది. ఇక నదులు .. సముద్రంలో కలిసే సంగమ క్షేత్రాల్లో దానం చేయడం వలన కలిగే పుణ్య విశేషం జన్మజన్మల పాటు వెంట వస్తుంది. అందువలన ఆయా క్షేత్రాలకి వెళ్లినప్పుడు అక్కడ ఎంతో కొంత దానం చేస్తూ ఉండటం మంచిది. ఇక ఎవరి జన్మ నక్షత్రం రోజును వాళ్లు గుర్తుపెట్టుకుని, ఆ రోజున దానం చేయడం వలన కూడా అనేక రెట్ల ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News