సంపదలను ప్రసాదించే శివుడు

జీవితాన్ని ఆర్ధిక పరిస్థితి ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అన్ని ఆనందాలు .. సంతోషాలు ఆర్ధిక పరిస్థితితో ముడిపడిలేకపోయినా, అది చూపించే ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అవసరాలు .. ఆపదల బారినుంచి బయటపడటానికి ఆర్ధిక పరిస్థితి బాగా ఉండవలసిందే. అలాంటి పరిస్థితుల్లో ఆయురారోగ్యాలతో పాటు ప్రతి ఒక్కరూ సంపదలను కూడా భగవంతుడిని కోరుతుంటారు.

ఇలా సంపదలను పొందాలనుకున్నవాళ్లు, పరమశివుడిని పూజించడం వలన ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సోమవారం పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్వామివారిని మారేడు దళాలతోను .. శంఖు పుష్పాలతోను పూజించడం వలన, సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలనుకునేవాళ్లు, సదాశివుడిని ఈ రీతిగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.


More Bhakti News