ఆధ్యాత్మిక సంపదే గొప్పది

ఎంతోమంది మహా భక్తులు తమ ఇష్ట దైవాన్ని అనునిత్యం ఆరాధిస్తూ .. కీర్తిస్తూ తరించారు. తమకి ఏదైనా ఆ భగవంతుడే ప్రసాదించాలి. ఆయన ఇవ్వనిదేది ఇతరులు ఇవ్వలేరు అని ఆ మహా భక్తులు విశ్వసించారు. వాళ్ల జీవితచరిత్రలను పరిశీలిస్తే, ఇతరుల నుంచి .. సాక్షాత్తు మహారాజుల నుంచి సైతం వాళ్లు ఎలాంటి కానుకలు స్వీకరించకపోవడం కనిపిస్తుంది.

పోతన .. త్యాగయ్య వంటి భక్తులు, రాజుల ఆశ్రయాన్ని కానీ .. వాళ్ల కానుకలనుగాని కోరుకోలేదు. అభిమానంతో వాళ్లు పంపిన ఆహ్వానాలను .. కానుకలను సున్నితంగా తిరస్కరించారు. ఇక భక్త తుకారామ్ అభంగాలను మెచ్చి శివాజీ మహారాజు ఖరీదైన కానుకలను పంపిస్తాడు. భగవంతుడి రూపాన్ని మనసునిండా నింపుకుని ఆయనని కీర్తించడంలో కలిగే ఆనందం, సంపదలను అనుభవించడంలో లేదని ప్రభువులకు నచ్చజెబుతూ తుకారామ్ ఆ కానుకలను తిరిగి పంపించివేస్తాడు.

పురందరదాసు భక్తిని గురించి .. ఆయన కీర్తనల గురించి తెలుసుకున్న శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఆయనకి కానుకలు పంపిస్తాడు. భౌతికమైన సంపదల కన్నా .. ఆధ్యాత్మిక పరమైన సంపద గొప్పదని చెబుతూ ఆయన ఆ కానుకలను పేదవారికి పంచిపెట్టేస్తాడు. దాంతో ఆయన భక్తి రాయలవారిని సైతం కదిలించి వేస్తుంది.


More Bhakti News