ముక్తిని ప్రసాదించే మల్లేశ్వరుడు

దేవతలు .. మహర్షులు .. మరెంతోమంది మహా భక్తులు పరమశివుడిని సేవిస్తూ తరించారు. తన భక్తుల కోరిక మేరకు ఆ సదాశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక మహిమలు చూపుతూ కోరిన వరాలను ప్రసాదిస్తూ వున్నాడు. అలాంటి ప్రాచీనమైన శైవక్షేత్రాల్లో ఒకటి బెంగుళూరులోని మల్లేశ్వరం అనే ప్రాంతంలో కనిపిస్తుంది. స్వామి కారణంగానే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని అంటారు.

ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేదట. ఆ అడవిలోని ఒక గుట్టపై గౌతమ మహర్షి శివానుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై .. మహర్షి కోరిక మేరకు అక్కడే లింగ రూపాన్ని ధరించాడని స్థలపురాణం వలన తెలుస్తోంది. ఆ తరువాత కాలంలో ఒక భక్తుడి కారణంగా స్వామివారు వెలుగు చూసినట్టుగా చెబుతారు.

అప్పటి నుంచి స్వామికి నిత్య దీప .. ధూప .. నైవేద్యాలు జరుగుతూ వస్తున్నాయి. శివుడు స్వయంగా వెలసిన క్షేత్రం కావడం వలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఆ స్వామిని దర్శిస్తూ .. సేవిస్తూ తరిస్తుంటారు. స్వామి దర్శన మాత్రం చేతనే పాపాలు నశిస్తాయనీ, సంతృప్తికరమైన జీవితం తరువాత మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News