గంగా పార్వతీ సమేత సోమేశ్వరుడు

పరమశివుడు గంగా పార్వతీ సమేతంగా కొలువైన క్షేత్రాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి 'రాయపూడి'లో కనిపిస్తుంది. గుంటూరు జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రాన్ని భక్తులు కామధేనువుగా .. కల్పవృక్షంగా భావిస్తుంటారు. ఆదిదేవుడు .. సోమేశ్వరుడుగా పిలవబడే ఈ క్షేత్రం ఎంతటి ప్రాచీనకాలం నాటిదో, అంతటి మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు.

సోమేశ్వర స్వామి ప్రాంగణంలోనే వీరభద్రస్వామి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. వీరభద్ర స్వామికి కాకతీయుల కాలంలో ఆలయం నిర్మించబడింది. ఇక సోమేశ్వరస్వామి ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడినట్టుగా ఇక్కడి శాసన ఆధారాల వలన తెలుస్తోంది. ఆ కాలాల్లో ఈ క్షేత్రాలు మరింత వైభవంగా వెలుగొందినట్టు తెలుస్తోంది.

అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకూ భక్తుల్లో అదే విశ్వాసం కనిపిస్తూ ఉంటుంది. అందమైన ప్రకృతి నడుమ అలరారుతోన్న ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన, సకలశుభాలు చేకూరతాయని చెబుతుంటారు. అనారోగ్యాలు తొలగిపోయి .. ఆయురారోగ్యాలు .. సిరిసంపదలు లభిస్తాయని విశ్వసిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి కానుకలు సమర్పించి తమ కృతజ్ఞతను తెలుపుకుంటూ ఉంటారు.


More Bhakti News