దృష్టి దోషాన్ని నివారించే హనుమంతుడు

హనుమంతుడు దృష్టి దోషాన్ని నివారిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హనుమంతుడిని స్మరిస్తూ ఆహారాన్ని తీసుకుంటే చాలనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ఏదైనా వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచినప్పుడు .. భోజనం చేస్తూ వుండగా దృష్టి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందువలన వేడుక అనంతరం .. భోజనాలు చేసిన తరువాత దృష్టి తీయడం వంటివి చేస్తుంటారు.

చాలామంది తాము భోజనం చేస్తుండగా ఇతరులు చూడటానికి ఇష్టపడరు. వాళ్లు భోజనం చేస్తూ వుండగా అనుకోకుండా ఎవరైనా వస్తే కాదనలేకపోతారు. అలా భోజనం చేసినప్పుడు కొంతమంది దృష్టి దోషానికి గురయ్యే అవకాశం వుంటుంది. ఫలితంగా భోజనం చేసిన వాళ్లకి తల తిరగడం .. కడుపులో వికారంగా అనిపించడం .. వాంతులు కావడం జరుగుతూ వుంటుంది.

భోజనం చేసే సమయంలో హనుమంతుడిని స్మరించుకోవడం వలన ఎలాంటి దృష్టి దోషం బారిన పడటం జరగదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన భోజనం చేసే సమయంలో '' అంజనీ గర్భ సంభూతం కుమారం బ్రహ్మచారిణం .. దృష్టి దోష వినాశాయ హనుమంతం స్మరామ్యహం'' అనే శ్లోకాన్ని చెప్పుకోవడం మరిచిపోవద్దు.


More Bhakti News