సప్త మోక్ష పురాలు

భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో 'సప్త మోక్ష పురములు'ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. అటు పురాణపరంగాను ... ఇటు చారిత్రక పరంగాను ఈ ప్రాంతాలు దివ్య క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. మానవుల జీవితాలపై ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపిస్తూ, అణువణువున భక్తిభావ పరిమళాలను వెదజల్లుతున్నాయి. మానవ దేహంలో ఉన్న ఏడు చక్రాలు ... ఈ సప్త మోక్షపురములందు నిక్షిప్తం చేయబడి ఉన్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

రామజన్మభూమి అయిన అయోధ్య (ఉత్తర ప్రదేశ్ )లో 'సహస్రాకార చక్రం' ... శ్రీ కృష్ణుడి జన్మ భూమి అయిన మధుర (ఉత్తర ప్రదేశ్ )లో 'ఆజ్ఞా చక్రం' ... హరిద్వారం (ఉత్తర ప్రదేశ్ )లో 'విశుద్ధ చక్రం'... కాశీ (ఉత్తర ప్రదేశ్ )లో 'అనాహత చక్రం' ... కంచి (తమిళనాడు .. శివకంచి - విష్ణుకంచి)లో చక్ర ప్రభావం చెరి సగానికి వర్తిస్తుంది. ఇక అవంతిక (మధ్య ప్రదేశ్ )లో 'మణిపూరక చక్రం' ... ద్వారక (గుజరాత్ )లో మూలాధార చక్రం స్థాపించబడి వున్నాయి. వీటిని దర్శించడం కారణంగా మోక్షం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.


More Bhakti News