తాంబూల సమయం

తాంబూలాలు మార్చుకోవడం ... తాంబూలం సమర్పించడం ... తాంబూలం వేసుకోవడం ... ఇలా తాంబూలానికి మన ఆచార వ్యవహారాలలో అగ్రస్థానం వుంది. అయితే అలాంటి తాంబూలం ఎప్పుడు వేసుకోకూడదనేది కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా భోజనం చేశాక వెంటనే తాంబూలం వేసుకుంటూ వుంటారు. అయితే ఆ భోజనంలో కొన్ని రకాల పదార్థాలు వాడినప్పుడు ... కొన్ని రకాల వ్యాధులు వున్నప్పుడు తాంబూలం వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

మధుమేహం ... చర్మరోగం ... క్షయ ... శ్వాస ... నేత్ర పరమైన వ్యాధులతో బాధ పడుతున్నప్పుడు, పైత్యం ... జ్వరం ... అతి మూత్రం ... అతిదాహం మొదలైన వ్యాధులు వున్నప్పుడు తాంబూలం వేసుకోకూడదని ఈ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే భోజనంలో అరటిపండు ... మామిడి పండు ... పనసపండు ... పాలు ... నేతి పదార్థాలు వాడినప్పుడు తాంబూలం వేసుకోకూడదని చెబుతున్నాయి. కనుక ఆరోగ్యానికి హాని చేసే ఈ సందర్భాల్లో తాంబూలం వేసుకోకపోవడమే అన్నివిధాలా మంచిది.


More Bhakti News