సప్త సంఖ్య ప్రాముఖ్యత

సంగీత సముద్రాన్ని దోసిట పట్టే సరిగమలు ఏడు ... ఆకాశాన విరిసే హరివిల్లులో రంగులు ఏడు ... ప్రపంచదేశాల్లో చోటుచేసుకున్న అద్భుతాలు ఏడు ... నూతన వధూవరులు హోమగుండం చుట్టూ వేసే అడుగులు ఏడు. సముద్రాలు ఏడు ... ద్వీపాలు ఏడు ... ఊర్ధ్వ లోకాలు ఏడు ... అధోలోకాలు ఏడు ... పర్వతాలు ఏడు ... సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడిని దర్శించడానికి దాటవలసిన ద్వారాలు ఏడు.

ఇలా సప్త సంఖ్యతో ముడిపడిన ఎన్నో విశేషాలు అటు పురాణాల్లోను ఇటు చరిత్రలోను మనకి కనిపిస్తాయి. క్షీర సముద్రం ... ఘ్రుత సముద్రం ... సురా సముద్రం ... ఇక్షు సముద్రం ... దధి సముద్రం ... లవణ సముద్రం ... జలసముద్రములను సప్త సముద్రాలుగా పిలుస్తుంటారు. ఇక మేరు పర్వతం ... కైలాస పర్వతం ... హిమాచల పర్వతం ... మందర పర్వతం ... గంధమాదన పర్వతం ... నిషధ పర్వతం ... రమణ పర్వతములను సప్త పర్వతములని అంటారు.

జంబూద్వీపం ... శాల్వల దీపం ... క్రౌంచ ద్వీపం ... ప్లక్ష ద్వీపం ... శాకద్వీపం ... కుశ ద్వీపం ... పుష్కర ద్వీపం ... సప్త ద్వీపములుగా ప్రసిద్ధి చెందాయి. ఇక అధో లోకలుగా అతల .. వితల .. సుతల .. మహాతల .. తలాతల .. రసాతల .. పాతాళ లోకాలు, ఊర్థ్వ లోకాలుగా భూలోకం ... భువర్లోకం .. స్వర్గలోకం .. మహర్లోకం .. జనలోకం .. తపోలోకం .. సత్యలోకాలు పేర్కొన బడ్డాయి. ఇలా సప్తసంఖ్య ఎంతో ప్రాముఖ్యతను ... ప్రాధాన్యతను సంతరించుకుంది.


More Bhakti News