హనుమంతుడి పెళ్లి

హనుమంతుడు లేని రామాయణాన్ని ... హనుమంతుడు లేని రామాలయాన్ని ఊహించలేం. మహా శక్తిమంతుడు ... ప్రభుభక్తి పరాయణుడు అయిన హనుమంతుడు బ్రహ్మచారి అని కొందరు ... ఆయనకి సువర్చలతో వివాహమైందని కొందరు వాదించుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్లు అసలు హనుమంతుడికి వివాహమైందా? ... కాలేదా? అని సందేహంలో పడిపోతుంటారు.

పురాణాలు మాత్రం హనుమంతుడికి వివాహం కాలేదనే చెబుతున్నాయి. హనుమంతుడు ... సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేశాడనే విషయం తెలిసిందే. అయితే విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో తెలియక హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు. అది గ్రహించిన సూర్యుడు తన కూతురు సువర్చలను వివాహమాడ వలసిందిగా కోరాడు.

సూర్యుడు కూతురు సువర్చలను వివాహమాడటానికి హనుమంతుడు అంగీకరించాడు. అయితే కలియుగం పూర్తి అయిన తరువాత మాత్రమే ఆమెను అర్థాంగిగా స్వీకరిస్తానని చెప్పాడు. సూర్యుడికి హనుమంతుడు ఇచ్చిన మాట నెరవేరాలంటే కలియుగం పూర్తి కావలసిందే కాబట్టి అప్పటి వరకూ హనుమంతుడు బ్రహ్మచారిగానే ఉంటాడనే ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది.


More Bhakti News