సమర్పణ

సాధారణంగా నదిలో ప్రయాణం చేస్తూ వుండగా గానీ, నది మీదుగా బస్సులోగాని ... రైల్లో గాని ప్రయాణం చేస్తున్నప్పుడు గాని నదిలో చిల్లర డబ్బులు వేయడం ... లేదంటే పండ్లు వేసి నమస్కరించడం చేస్తుంటారు. నిజం చెప్పాలంటే ఈ విధంగా చేయడం మన పూర్వీకుల నుంచి వచ్చినదే. జీవరాశికి ఆకలి దప్పులు తీర్చే నదులను దేవతలుగా భావించి ఆరాధించడం మన సంప్రదాయం. ఈ కారణంగానే నదీమ తల్లికి కానుకలుగా చిల్లర డబ్బులు ... నైవేద్యంగా పండ్లు సమర్పిస్తూ వుంటారు. ఇక ఈ ఆచారం వెనుక మరో ప్రయోజనం లేకపోలేదు.

పూర్వం 'రాగి' పైసలు చెలామణిలో ఉండేవి. రాగి కలిసిన కారణంగా నీరు మరింత పరిశుద్ధమవుతుంది. ఆ నీరు తాగడం వలన ఆరోగ్యం పొందడం జరుగుతుంది. ఇక పండ్లను నదికి సమర్పించడమంటే ... ఆ నదిలోని జీవరాశికి ఆహారాన్ని అందించడమే. నీటిలోని జీవులు నేలపైకి రాలేవు. ఆ నీటిలో వాటికి సరిపడేంత ఆహారం దొరక్కపోవచ్చు. ఈ కారణంగా మానవత్వంతో వాటికి ఆహారాన్ని అందించాలనే మంచి ఉద్దేశమే మనకి కనిపిస్తుంది.


More Bhakti News