పగడాల మాలతో జపం వలన ఫలితం !

విశేషమైన పుణ్యఫలితాలను పొందడం కోసం ... మనోభీష్టం నెరవేరడం కోసం జపం చేయడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది. ఆలయాలలోను ... పవిత్రమైన ... ప్రశాంతమైన ప్రదేశాల్లోనూ కూర్చుని జపం చేసుకునేవాళ్లు అక్కడక్కడా కనిపిస్తూనే వుంటారు.

ప్రతి జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి యొక్క దివ్యమైన నామాన్ని నూటా ఎనిమిది మార్లు జపించినట్టు తెలియడానికిగాను అంతా జపమాలలు వాడుతుంటారు.

జపం చేసుకోవడానికిగాను తులసిమాల ... స్పటికమాల ... శంఖమాల ... ముత్యాలమాల ... రుద్రాక్షమాల ... ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.

పగడాలు ధరించడం ... పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ వుంది. పగడాల మాలతో జపం చేయడం వలన సంపదలు వృద్ధి చెందుతాయని చెప్పబడుతోంది. ఇక జపమాల ఏదైనా మనసును పరిపూర్ణంగా భగవంతుడి నామస్మరణపై నిలిపినప్పుడు మాత్రమే అది ఆశించిన ఫలితాలను ఇస్తుంది. లేదంటే ఆ జపం నలుగురు చెప్పుకోవడానికే తప్ప భగవంతుడి మెప్పును పొందలేకపోతుంది.


More Bhakti News