భార్యాభర్తలు

నూతన వధూవరులు కలిసి ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఒకరి పేరు ఒకరితో చెప్పిస్తుంటారు. భార్య ... భర్తను పేరు పెట్టి పిలవకూడదని అంటారు. మరి ఇలా పేరు చెప్పించడమేంటని కొంతమంది అనుకుంటూ వుంటారు. నిజానికి నూతన వధూవరులతో ఒకరి పేరు ఒకరు చెప్పించడం వెనుక గల అర్థం ... వారి మధ్య గల కొత్త దనాన్ని దూరం చేసి ... చనువు పెరిగేలా చేయడమే.

ఇక భర్తను పేరు పెట్టి భార్య పిలవకూడదని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా పిలవడం వలన ఆ భర్తకు నలుగురిలో గౌరవం లేకుండా పోతుందని అంటారు. భార్య పెత్తనం ఎక్కువనీ ... భర్తను చెప్పుచేతల్లో పెట్టుకుందని నలుగురూ నానారకాలుగా అనుకుంటారు. దాంతో ఇటు ఆమె ... అటు ఆమె భర్త ఇద్దరూ కూడా అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన అన్యోన్య దాంపత్య మైనప్పటికీ ఏకాంతంగా వున్నప్పుడు తప్ప, భర్తను పేరు పెట్టి భార్య పిలవకూడదని అంటారు.

మన పురాణాల్లోను ... ఇతిహాసాలలోను ఈ విషయం స్పష్టంగా పేర్కొనబడింది. అలాగే భర్త కూడా భార్యను ఆమె తండ్రి పేరును కలిపి గౌరవ పూర్వకంగా పిలవడం గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి


More Bhakti News