తిథులు - వంటలు

సాధారణంగా ప్రతినిత్యం కొందరు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే వుంటారు. దైవానికి నివేదన చేసిన వంటకాలనే వాళ్లు ఆహారంగా తీసుకుంటూ వుంటారు. ఈ కారణంగా ప్రతి రోజు ఏదో ఒక వంటకం దేవుడికి సమర్పించడం ... ఆ తరువాత దానిని ప్రసాదంగా భావించి స్వీకరించడం జరిగిపోతుంటుంది. అయితే శాస్త్రం మాత్రం కొన్ని తిథుల్లో కొన్ని వంటకాలను తినకూడదని చెబుతోంది.

పాడ్యమి రోజున గుమ్మడికాయ ... విదియ రోజున వాకుడుకాయ ... తదియ రోజున పొట్లకాయ ... చవితి రోజున ముల్లంగి ... అష్టమి రోజున కొబ్బరి కాయ ... నవమి రోజున సొరకాయ ... దశమి రోజున తీగ బచ్చలి ... ద్వాదశి రోజున మాంసము ... త్రయోదశి రోజున ములక్కాడలు ... చతుర్దశి రోజున మినుములకు సంబంధించిన వంటలను తినరాదని అంటారు.

ఈ నియమాన్ని గుర్తుపెట్టుకుంటే ఆయా తిథుల్లో ఆ వంటకాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వీటికి బదులుగా చేసే వంటకాలను దైవానికి సమర్పించి ఆ తరువాత వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆధ్యాత్మిక పరంగా పూర్వీకులు ఏర్పరిచిన ఈ నియమాన్ని పాటించడం మంచిదనే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News