కుజ దోష ప్రభావం ఇలా తగ్గుతుంది

కుజగ్రహ సంబంధమైన దోషానికి గురైనవాళ్లు తీవ్రమైన మానసిక ఆందోళనకి లోనవుతుంటారు. ఎందుకంటే కుజదోష ప్రభావం వలన అందరితోను మనస్పర్థలు వస్తుంటాయి. అంతా దూరమవుతూ ఉండటంతో మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. అనుకోని గొడవల్లో తలదూర్చడం వలన అందులో నుంచి బయటపడటానికి నానాతంటాలు పడవలసి వస్తుంది.

వివాహం విషయంలో ఆలస్యమవుతూ ఉండటం ... వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడటం జరుగుతుంది. ఇక ఈ దోష ప్రభావం వలన అనారోగ్య సమస్యలు కూడా సతమతం చేస్తుంటాయి. ఈ కారణంగానే కుజదోషం అనగానే కంగారు పడిపోతుంటారు ... సాధ్యమైనంత త్వరగా ఆ బాధల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఎవరికి తెలిసిన ప్రయత్నాలు వాళ్లు చేస్తూనే ఉంటారు.

కుజదోష ప్రభావం తగ్గడానికి కొన్ని మార్గాలు చెప్పబడుతున్నాయి. కుజుడు శాంతించడానికిగాను 'పగడం' ధరించవలసి ఉంటుంది. కుజుడికి 'మంగళుడు' అనే పేరు ఉంది. అందువలన ప్రతి మంగళవారం ఉపవాస దీక్షను చేపట్టాలి. దగ్గరలోని హనుమంతుడి ఆలయానికిగానీ, ఇతర ఆలయాలకుగాని వెళ్లి అక్కడ దీపం వెలిగించాలి. ముందుగా అనుకున్న సంఖ్య ప్రకారం ఆ స్వామికి ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉండటం వలన కుజ సంబంధమైన దోష ప్రభావం తగ్గుముఖం పడుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News