రోలు - పొత్రం

ఇప్పుడంటే అందరి ఇళ్లలో గ్రైన్డర్లు ... మిక్సీలు దర్శనమిస్తున్నాయి కానీ, ఒకప్పుడు ఆ పనులన్నీ రోలు ... పొత్రం .. రోకలితోనే చేసేవారు. ఆచార వ్యవహారాలకి ప్రాధాన్యతను ఇచ్చే కొందరు మాత్రం ఆధునిక పరికరాలు ఉన్నప్పటికీ, తమ ఇంట్లో రోలు - రోకలి ఉండేలా చూసుకుంటున్నారు.

ఇంట్లో జరిగే కొన్ని వేడుకలకు ముందుగా రోటిని ... రోకలిని శుభ్రముగా కడిగి, పసుపు రాసి ... కుంకుమ బొట్లు పెట్టి శుభకార్యాలకు సంబంధించిన పనులను ప్రారంభించే ఆచారం తరతరాలుగా వస్తోంది. రోలును పార్వతీ దేవి స్వరూపంగా ... రోకలి లేదా పొత్రం శివ స్వరూపంగా భావించడమే ఇందుకు కారణం. సహజంగానే రోలు - పొత్రం శివలింగాన్ని పోలివుంటాయి. అందువల్లనే ఇంట్లో పవిత్రమైన ప్రదేశంలోనే వాటిని ఉంచుతూ వుంటారు.


More Bhakti News