కార్తీక శుద్ధ పాడ్యమి విశేషం !

కార్తీక శుద్ధ పాడ్యమి ... 'బలిపాడ్యమి' గా చెప్పబడుతోంది. 'బలిచక్రవర్తి'కి ప్రీతికరమైన రోజు కనుక దీనికి బలిపాడ్యమి అనే పేరు వచ్చింది. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పిండితో బలిచక్రవర్తి బొమ్మను గీసుకుని ఆయనని పూజించవలసి ఉంటుంది. '' బలిరాజ నమస్తుభ్యం విరోచనసుత ప్రభో, భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతిగృహ్యాతాం'' అంటూ ఆయనని ఆరాధించాలి.

బలిచక్రవర్తికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఎవరి శక్తికి తగినట్టుగా వాళ్లు దానాలు చేయాలని చెప్పబడుతోంది. ఈ రోజున చేసే దానాల వలన కలిగే ఫలితం విశేషంగా ఉంటుందని స్పష్టం చేయబడుతోంది. బలిపాడ్యమి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారికి సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.

ఇక ఈ రోజున చాలామంది 'గోవర్ధన పూజ' చేస్తుంటారు. ఆవు పేడను ముద్దగా చేసి దానిని పూజా మందిరంలో ఉంచుతారు. దానిని గోవర్ధన గిరిగా భావించి పూజిస్తారు. ఆ గోవర్ధన పర్వతానికి ఎదురుగా కొంత అన్నాన్ని రాశిగా పోసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తూ వుంటారు.


More Bhakti News