శ్రీ కామాక్షీ దేవి

'శ్రీ కామాక్షీ దేవి' శక్తి పీఠం చెన్నైకి సమీపంలోగల 'కంచి'లో వుంది. అమ్మవారు 'వడ్డాణం'(కాంచి )ధరించిన భాగం ఇక్కడ పడటం వలన, ఈ శక్తి పీఠానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు తీర్చు కొంగు బంగారమై అలరారుతున్నది. ప్రతి నిత్యం అమ్మవారిని ముందుగా ఆవు - దూడ, ఆ తరువాత ఏనుగు దర్శనం చేసుకోవడం ఇక్కడి ఆనవాయతి. ఆ తరువాతనే భక్తులకు ప్రవేశం వుంటుంది.

ఒకానొక శాపకారణంగా కాత్యాయన మహర్షి కూతురిగా పెరిగిన పార్వతి, ఆ తరువాత కాంచీపురానికి చేరుకొని 'ఏకామ్రేశ్వర' సైకత లింగాన్ని పూజించి శివుడి మనసు దోచుకుంది. విష్ణుమూర్తి వారి వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తాడు. ఆ సంతోషంలో పార్వతీదేవి తన కంటి చూపుతోనే భక్తుల కోరికలను నెరవేర్చింది. అది గమనించిన శివుడు 'కామాక్షీ దేవి' పేరుతో వర్ధిల్లమంటూ అనుగ్రహించాడు.

ఈ వివాహానికి వచ్చిన దేవతలు ... ఋషులు ఆది దంపతులను అక్కడే కొలువై ఉండమంటూ ప్రార్ధించారు. వారి కోరికను మన్నించి కామాక్షీ - శంకరుడు అక్కడే వెలిసి ఆ ప్రదేశాన్ని ముక్తి క్షేత్రంగా మార్చారు. ఇక్కడ శివుడు ఏకామ్రేశ్వరుడు పేరుతోను ... విష్ణువు, వరదరాజస్వామి పేరుతోను పూజలు అందుకుంటూ ఉంటారు.


More Bhakti News