ఆశ్చర్యచకితులను చేసే శివలింగం

పరమశివుడికి సంబంధించిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా 'మేళ్ల చెరువు' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం అనేక విశేషాలకు ... మహిమలకు నెలవుగా కనిపిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలో శివలింగం శిరోభాగంలో చిన్నగుంట వుండటం ... అందులో నుంచి నీరు అదే పనిగా వస్తూ వుండటం ఇక్కడి విశేషంగా చెబుతూ వుంటారు. నిరంతరం ఈ గుంటలోకి వచ్చే నీటినే భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు.

ఇలా జల ఊరే ఈ శివలింగం పెరుగుతూ వుండటం ఇక్కడ గల మరో విశేషంగా చెబుతుంటారు. ఈ శివలింగానికి గల మరో విశేషం ... దీనికి అయిదు పానవట్టాలు ఉండటమే. సాధారణంగా ఏ శివలింగానికైనా ఒక పానవట్టం మాత్రమే వుంటుంది. కానీ ఇక్కడి శివలింగానికి అయిదు పానవట్టాలు కనిపిస్తుంటాయి.

భూమి పైభాగంలో రెండు పానవట్టాలు కనిపిస్తూ వుండగా, మిగతా మూడు పానవట్టాలు భూమి లోపల భాగంలో కనిపిస్తూ వుంటాయి. ఇలా అయిదు పానవట్టాలు కలిగిన శివలింగం దాదాపుగా ఎక్కడా కనిపించదు. ఇలా అనేక ప్రత్యేకతలను సంతరించికున్న ఇక్కడి శివుడు, శంభులింగేశ్వరుడుగా ప్రాచీనకాలం నుంచి పూజలు అందుకుంటున్నాడు.


More Bhakti News