దాన ఫలితాలు

'దానంకొద్ది బిడ్డలు ... పుణ్యంకొద్ది పురుషుడు'... 'ఈ జన్మలో చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది'అనే మాటలు మనం వింటూ వుంటాం. పురాణాలు కూడా దానం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి. ఈ కారణంగానే దైవ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత చాలా మంది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి తమకి తోచిన విధంగా దానధర్మాలు చేస్తుంటారు.

దానం చేయడం వలన పుణ్యం వస్తుందని తెలుసుగానీ, ఏయే దానాలు చేయడం వలన ఎలాంటి పుణ్య ఫలాలు దక్కుతాయనేది మాత్రం చాలామందికి తెలియదు. 'భూదానం'చేయడం వలన శివలోక ప్రాప్తి ...'గోదానం' చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

'కన్యాదానం' వలన పూర్వీకులు సైతం తరిస్తారు. ఇక ఏనుగుని దానం చేయడం వలన శివ సాన్నిధ్యం ... గుర్రాన్ని దానం చేయడం వలన గంధర్వలోక ప్రవేశం కలుగుతాయి. అలాగే బంగారాన్ని దానం చేయడం వలన విష్ణులోక ప్రాప్తి ... వెండిని దానం చేయడం వలన శివలోక ప్రాప్తి కలుగుతాయని తెలుస్తోంది. అందువలన ఫలితాలను గురించి తెలిసి ఉన్నట్టయితే ఆయా సందర్భాలలో ఆయా దానాలను చేయడానికి సిద్ధపడే అవకాశముంటుందనే విషయాన్ని గమనించాలి.


More Bhakti News